కుక్కల దాడిలో మూగ బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మన్సూరాబాద్ డివిజన్ శివగంగా కాలనీలో చోటు చేసుకుంది. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో తిరుపతిరావు, చంద్రకళ దంపతులకు కూమారుడు ప్రేంచంద్ (8) కి మాటలు రావు. తిరుపతిరావు మేస్త్రి పని చేసుకుంటూ శివగంగా కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు బాలుడిపై మూకుమ్మడిగా వీధి కుక్కలు దాడి చేయగా , బాలుడికి శరీరమంతా గాయాలైయ్యాయి. స్దానికులు గమనించి వెంటనే కుక్కలను అక్కడి నుంచి తరిమి వేశారు. వెంటనే తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.