హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజ్ భవన్‌ల పేరును లోక్ భవన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజ్ భవన్ పేరును లోక్ భవన్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వలసవాద వాసనలను తుడిచి పెట్టేందుకు రాజ్ భవన్, రాజ్ నివాస్‌ల పేర్లను లోక్ భవన్, లోక్ నివాస్‌లుగా మార్చే అంశాన్ని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తే.. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖకు అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో రాజ్ భవన్‌లను లోక్ భవన్‌లుగా మార్చారు. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది.