యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడైన బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అండర్-19 జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేసిన అతడు ప్రస్తుతం సయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు మరో రికార్డు సెంచరీ చేశాడు. ఏడు ఫోర్లు, ఏడు సిక్సుల సాయంతో 61 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతి చిన్న వయస్సులో ఈ టోర్నమెంట్‌లో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర, బిహార్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ ఈ రిరకార్డును 14 ఏళ్ల 250 రోజుల్లో సెంచరీ చేసి మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. గతంలో ఈ రికార్డు విజయ్ జోల్ పేరిట ఉండేది. జోల్ 18 ఏళ్ల, 118 రోజుల వయస్సులో సెంచరీ సాధిచాడు. ఈ సందర్భంగా వైభవ్‌పై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.