హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై సిఎస్, రామకృష్ణరావు ఉన్నతాధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. గ్లోబల్ సమిట్ పనులను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులు మంత్రికి వివరించారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఆర్అండ్ బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే 3 షిప్టుల్లో పని పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశం ఇచ్చారు.