నేటినుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, జాతీయ భద్రత తదితర అంశాలపై చర్చకు పట్టుపట్టనున్న విపక్షాలు
14 బిల్లులతో సిద్ధమైన ప్రభుత్వం
చర్చల ఎజెండాను బిఎసి నిర్ణయిస్తుంది
అఖిలపక్ష భేటీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు
న్యూఢిల్లీ: డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాలం సమావేశాలకు రంగం సిద్ధమైంది. పార్లమెంటులో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రి విజన్, జాతీయ భద్రత పరిస్థితిపై స్పష్టమైన చర్చ జరగాలని, ఆదివారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశంలోనే ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పార్లమెంటు ఉభయసభలు సజావుగా జ రిగేందుకు సహకరించాలని, అన్ని పక్షాలతో కలి సి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్ర భుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. శీతాకాలం సమావేశాలకు ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి 36 రాజకీయ పా ర్టీలకు చెందిన 50మంది నాయకులు హాజరయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బిజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జెపినడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్ రిజిజు సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎల్ మురుగేశన్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సర్‌తో పాటు, ఢిల్లీ పేలుడు తర్వాత జాతీయ భద్రత పరిస్థితి, కార్మిక కోడ్‌లు వంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చా యి. అలాగే ఫెడరలిజం, అసెంబ్లీలు ఆమోదించి న బిల్లులను కొందరు గవర్నర్లు తొక్కి పెట్టిన అం శాలు, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులఅంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా పార్లమెంటు శీతాకాలం సమావేశా లు సజావుగా, ప్రశాంతంగా సాగేటట్లు సహకరించాలని అన్ని పార్టీలను పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరారు.
బొత్తిగా 15 రోజులేనా సమావేశాలు?
శీతాకాలం సమావేశాలను కేవలం నామ్ కే వాస్తే ని ర్వహిస్తున్నట్లు కన్పిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి జయ రాం రమేశ్ అన్నారు. ప్రతిపక్షాలతో సంప్రదింపులు జ రపకుండా కేవలం తక్కువ కాలం వ్యవధి నిర్ణయించడం నరేంద్రమోదీ సర్కార్ వైఖరికి అద్దంపడుతోందన్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు పార్లమెంటరీ చరిత్రలోనే అతి తక్కువ సమయం జరుగుతాయని, మోదీ సర్కార్ 13 బిల్లులను ఆమోదం కోసం సిద్ధం చేసిందని, అందులో ఒకటి ఆర్డినెన్స్ స్థానే ప్రవేశపెట్టే బిల్లు అనీ, రెండు లోక్ సభ కమిటీ పరిశీలించినవని, కాబట్టి పది బిల్లులను సంబంధిత స్టాండింగ్ కమిటీ పరిశీలించనే లేదని జైరాంరమేశ్ విమర్శించారు.
అణుశక్తి బిల్లుతో సహా 14 బిల్లులు సిద్ధం
పార్లమెంటులో ప్రతిపాదిత అణుశక్తి బిల్లు 2025 తో సహా 14 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండి యా బిల్లు 2025, జన్ విశ్వాస్ (సవరణ) బిల్లు 2025, ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ బిల్లు 2025, ఆర్డినెన్స్ స్థానే మణిపూర్ వస్తువులు సేవల పన్ను(రెండో సవరణ) బిల్లు, హైవే అభివృద్ధి కోసం పారదర్శకంగా భూసేకరణకు ఉద్దేశించిన జాతీయ రహదారుల (సవరణ)బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి.