మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డే రాయ్‌పూర్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు గుడ్‌న్యూస్ వచ్చింది. గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్, తొలి వన్డేకి దూరమైన శుభ్‌మాన్ గిల్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడని తెలిసింది.
డిసెంబర్ 1న బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో గిల్ రిహాబ్ కార్యక్రమం ప్రారంభమైందని తెలుస్తోంది. ముంబైలో విస్తృత ఫిజియోథెరపి పూర్తి చేసిన గిల్, కుటుంబంతో కొద్ది రోజులు గడిపి.. ప్రస్తుతం బిసిసిఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని సమాచారం. వైద్యులు ప్రత్యేక ఫిట్‌నెస్ ప్రొగ్రామ్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాయం కారణంగా బ్యాటింగ్‌కి దూరమైన గిల్ త్వరలోనే తేలికపాటి నెట్ సెషన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ వన్డే సిరీస్‌కి దూరమైన గిల్.. తిరిగి సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్‌లో పాల్గొంటాడని సమాచారం.