మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు. జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీల వి లీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్, అర్బన్ డవలప్ మెంట్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. జీహెచ్‌ఎంసీలో 7 ము న్సిపల్ కార్పొరేషన్లు, 20మున్సిపాలిటీలను వి లీనం చేయాలని ఈ నెల 25న జరిగిన మం త్రివర్గ సమావేశంలో ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతోపాటు విలీనం అంశాన్ని ఈ నెల 25న జరిగిన జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించారు. కాగా దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభు త్వం నుంచి గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ను పంపించడంతో ఆయన ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ ఫైల్ లోక్ భవన్ నుంచి న్యాయ శాఖకు వ చ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు సం బంధించిన గెజిట్ విడుదల చేయనుంది. విలీ న పక్రియలో భాగంగా 27 మున్సిపాలిటీల ఆ స్తులను హ్యాండ్ ఓవర్, వంటి అంశాలను గు ర్తించి గెజిట్‌లో ప్రభుత్వం వివరిస్తుందని అధికార వర్గాల సమాచారం.