ఢిల్లీ: భోజనం కోసం వెళ్లిన బాలుడిపై సిఆర్‌పిఎఫ్ జవాన్ కాల్పులు జరడంతో అతడు మృతి చెందాడు. ఈ సంఘటన ఢిల్లీలోని శాహ్‌దరాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానససరోవర్ పార్కులోని డిడిఎ మార్కెట్ వద్ద ఓ కమ్యూనిటి సెంటర్‌లో వివాహ వేడుక జరుగుతుంది. మురికి వాడల్లో నివసింటే ఓ బాలుడు(17) గేటు దూకి అన్నం కోసం వెళ్లాడు. అతడి భోజనం చేస్తుండగా అక్కడ ఉన్నవారు బయటకు నెట్టేయడానికి ప్రయత్నించాడు. సిఐఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బాలుడితో వాగ్వాదానికి దిగాడు. తుపాకీ తీసి ఆవేశంలో కాల్పులు జరపడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని సరీక్షించిన వైద్యులు తెలిపారు. బుక్కెడు అన్నం కోసం వెళ్తె పొట్టన పెట్టుకుంటారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.