తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు హోటళ్లను లక్ష్యంగా చేసు కుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో హోటళ్ల యాజమాన్యాలు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే పోలీ సులకు సమాచారం అందించాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో ఉన్న రెండు హోటళ్లకు బాంబు పెట్టినట్లు బెదిరిం పు మెయిల్స్ అందాయి. ఈ సమాచారం అందుకున్న హోటళ్ల నిర్వాహకులు అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆయా హోటళ్లకు చేరుకున్నారు.
అక్కడ తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. అయితే, అక్కడ ఎలాంటి బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితమే తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం, టిటిడి కార్యాలయం, రైల్వే స్టేషన్‌కు కూడా ఇలాగే ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం గమనా ర్హం. అప్పుడు కూడా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిచారు. ప్రస్తుతం మళ్లీ హోటళ్లను లక్ష్యంగా చేసుకోవడంతో ఇది ఆకతాయిల పనే అని పోలీసులు అనుమానిస్తు న్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోం ది.