చెన్నై : తమిళనాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 11మంది మృతి చెందారు. దాదాపు 40 మంది వరకూ గాయపడ్డారు. రాష్ట్రంలోని శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు వద్ద తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు మృతి చెందారని అధికారులు తెలిపారు.వీరిలో తొమ్మండుగురు మహిళలు ఉన్నారు. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ముందు మృతుల సంఖ్య ఏడు అని ప్రకటించారు.
కానీ చికిత్స పొందుతున్న వారిలో కొందరు చనిపోవడంతో ఈ సంఖ్య పెరిగింది.హైవేపై ఓ బస్సు కరైకూడకి మరోటి మధురైకు వెళ్లుతుండగా బస్సులు ఢీకొన్నాయి. దీనితో వాహనాల ముందు భాగాలు ఒకదానిలోకి మరోటి చొ చ్చుకువెళ్లాయి. లోపల ప్రయాణికులు విలవిలలాడుతూ ప్రా ణాలు కోల్పోయ్యారు.. ఘటన గురించి తెలియగానే అక్కడికి స్థానికులు , సహాయక బృందాలు వచ్చి గాయపడ్డ వారిని హు టాహుటిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడైంది. ఘటనపై సిఎం ఎంకె స్టాలిన్ స్పందించారు.