వరుణ్ సందేశ్ నటించిన తొలి ఓటీటీ తెలుగు వెబ్ సీరిస్ ’నయనం’. డిసెంబర్ 19 నుండి ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్ వెబ్ సీరిస్ ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్త్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించబోతున్నారు. ’నయనం’ వెబ్ సీరిస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఒరిజినల్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ’‘నటుడిగా నాకు ఇది సరికొత్త ప్రయాణం. ఇప్పటి వరకూ చేయనటువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నాను”అని అన్నారు.