మన తెలంగాణ/హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల లో సిసిఐ విధించిన నిబంధనలతో ఏర్పడిన ప్రతిష్టంభనలు ఎట్టకేలకు తొలగాయిని రా ష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. సిసిఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విధించిన కొత్త నిబంధనల కారణంగా కొనుగోళ్లకు అనుమతులు లభించని జి న్నింగ్ మిల్లులలో కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిసిఐతో జరిపిన చర్చలు ఫలించాయన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ నోటిఫై చేసిన మొత్తం 330 జిన్నింగ్ మిల్లుల్లో సోమవారం నుండి పత్తి కొనుగోళ్లు చురుగ్గా కొనసాగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. సిసిఐ కొత్త నిబంధనల కా రణంగా అనుమతులు లభించకపోవడంతో జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ గతంలో సమ్మెకు దిగింది. దీనివల్ల రైతులు తాము పండించిన పత్తిని అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి తుమ్మల స్వయంగా చొరవ చూపారు. ఆయన కేం ద్ర మంత్రులతో పాటు సిసిఐ సిఎండితో ప్రత్యేక చొరవ తీసుకుని వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల స్పందన రావడంతో, 330 మిల్లుల్లో కొనుగోళ్లకు అనుమతులు లభించాయి. సమస్య పరిష్కారంలో మంత్రి తుమ్మల చూపిన వేగవంతమైన చర్యలకు, చొరవకు జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులకు, మిల్లుల కార్మికులకు ఉపశమనం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సిసిఐ రాష్ట్రంలో రూ. 3,201 కోట్లతో మొత్తం 4.03 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించిందని మంత్రి తుమ్మల వెల్లడించారు.