హైదరాబాద్: హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. 9 వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను బిజెపి బృందం కలిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జివొ నెంబరు 27న విత్ డ్రా చేసేలా చూడాలని గవర్నర్ ను కోరామని తెలియజేశారు. హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అప్పటి, ఇప్పటి ధరలు పోల్చి చూస్తే అక్రమాలు తెలుస్తున్నాయని రామచందర్ అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. కోకా పేటలో ఇటీవల ఎకరం ఎంత పలికిందో మనం చూశామని, జిఎహెచ్ఎంసి విస్తరణలోనూ అనేక కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు. ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని రామచందర్ రావు పేర్కొన్నారు.