టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వివాహం జరిగినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందరూ అనుకున్నట్లే దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత వివాహం జరిగినట్లు సమాచారం. కోయంబత్తూర్‌లోని ఈశా యోగ సెంటర్‌లో వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. రాజ్-సమంతలు రిలేషన్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వినిపించాయి. చాలా సందర్భాల్లో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ, ఇప్పటివరకూ ఇరువురు తమ రిలేషన్ గురించి అధికారికంగా మాట్లాడలేదు.
ఇప్పుడు సడెన్‌గా వీరిద్దరి వివాహ వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో సమంత ఎరుపు రంగ చీర కట్టుకున్నట్లు సమాచారం. 2017లో సమంత, హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2024లో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాలను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సమంత కూడా రెండో వివాహం చేసుకుంది. రాజ్‌కి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం. శ్యామలీ దే అనే మహిళను 2015లో వివాహం చేసుకున్న రాజ్ 2022లో విడాకులు ఇచ్చాడు. రాజ్-సమంతల పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న వేళ శ్యామలీ దే చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘తెగించిన వ్యక్తులు.. అందుకు తగ్గట్టుగానే పనులు చేస్తారు’’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. అయితే రాజ్-సమంతల వివాహంపై ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాలేదు. సోమవారం సాయంత్రానికి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.