మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర జ్యూడిషియల్ సర్వీసులో సివిల్ జడ్జిల (జూనియర్ డివిజన్) స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్దతిలో అర్హుల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర హైకోర్ట్ రిజిస్ట్రార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలియచేశారు. ఈ సివిల్ జడ్జిల (జూనియర్ డివిజన్) పోస్టులకు డిసెంబర్ 8వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఆన్-లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఈ పోస్టుల పరీక్ష తేదీలు, హల్ టికెట్ల డౌన్ లోడ్, కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష ఇతర వివరాలను వెబ్-సైట్ లో ప్రకటించడం జరుగుతుందని రిజిస్ట్రార్ తెలిపారు. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం హై-కోర్ట్ వెబ్‌సైట్ http://tshc.gov.comను సంప్రదించాలని కోరారు.