అమరావతి: పల్నాడు జిల్లా సత్తెన్న పల్లి మండలం ధూళిపాళ్ళలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు ఇంట్లోకి చొరబడి తల్లి, కుమారుడిపై హత్యాయత్నం చేశారు. కుమారుడు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తల్లి కృష్ణకుమారి, కుమారుడు సాంబశివరావుగా గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.