ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నవదీప్ పల్లపొలి, సాయి దుర్గ తేజ్ సారథ్యంలో శ్రీకాంత్ మన్నెపురి ‘డిస్కవర్ ఆంధ్ర’ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ ప్రాజెక్ట్‌ని పడాల సురేందర్ రెడ్డి, శ్రావ్య కూనం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ “ఆంధ్రను ఇంత అద్భుతంగా చూపిస్తున్న శ్రీకాంత్‌కి థాంక్స్. మన చుట్టూనే ఇన్ని అద్భుతాలు ఉన్నాయా? అని అందరూ ఆశ్చర్యపోతారు. ‘గ్రీన్ పాస్’ అనే ఎన్జీవోని నా స్నేహితుడితో కలిసి ప్రారంభించాను. బీచ్ క్లీన్ చేయడం, కోస్టల్ ఏరియాలోని జీవుల్ని, పక్షుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. మన చుట్టూ ఉన్న ఈ వైల్డ్ లైఫ్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే”అని అన్నారు. శ్రీకాంత్ మన్నెపూరి మాట్లాడుతూ “వైల్డ్ లైఫ్ అంటే ఆంధ్ర అనేది గుర్తుకు రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు కేవలం టైటిల్, గ్లింప్స్ మాత్రమే చూపించాం. త్వరలోనే ట్రైలర్‌తో అందరినీ కట్టిపడేస్తాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవదీప్ పాల్గొన్నారు.