రాంచీ: సౌతాప్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రకా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు 4వ ఓవర్‌లో షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (18) కీపర్ డికాక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ.. ప్రోటీస్ బౌలర్లపై విరుచుకుపడ్డా. 48 బంతుల్లో అర్థశతకం సాధించాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా నిలకడగా ఆడుతు.. హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటేశాడు. అయితే 22వ ఓవర్‌లో రోహిత్ శర్మ(57) ఎల్‌బిడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. విరాట్, రోహిత్ విధ్వంసం.. తొలి వన్డేలో అర్థ శతకాలుదీంతో 22 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ (73), గైక్వాడ్ (1) ఉన్నారు.