అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరులో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్రయత్నించింది. దీంతో ప్రియుడు, ప్రియురాలును పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోతిగుట్టకు చెందిన సి వెంకటేశ్ అనే యువకుడు జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శిల్ప అనే యువతిని పెళ్లి చేసుకొని ఉంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం నూనెవారిపల్లెకు చెందిన వెంకటేశ్‌తో శిల్ప వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో తొలగించుకోవాలని ప్రయత్నించింది. మే 16న భర్తపై వేడినూనె పోసి అనంతరం ప్రియుడితో కలిసి భర్త పారిపోయింది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చావు నుంచి బయటపడ్డాడు. అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రియుడు, ప్రియురాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత ఏడు నెలల నుంచి తప్పించుకున్న తిరుగుతున్న ప్రియుడి, ప్రియురాలిని పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.