ముంబై ః పెళ్లి ఓ కాలం చెల్లిన కట్టుబాట్ల వ్యవస్థ. తన ఉద్ధేశంలో యువతరం ఈ పెళ్లి తంతుకు వెళ్లకుండా హాయిగా తన జీవితం తాను అనుభవిస్తూ ఆనందించాలని ప్రముఖ నటి జయ బాధురి చెప్పారు. సామాజిక, రాజకీయ, సిని రంగ విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడే జయ బాధురి ఇప్పుడు భారతీయ వివాహ వ్యవస్థపై స్పందించారు. తన మనవరాలు నవ్య నవేలీ నందా పెళ్లి చేసుకోకుండా ఉండటం తనకు ఇష్టం అని కూడా తెలిపారు. తన తరం వంతు అయిపోయింది. ఇప్పుడు నవ యువ తరం వచ్చింది. ఈ తరం పెళ్లి బంధంలో చిక్కుకుపోరాదని ఆమె ఇటీవల వి ది ఉమెన్ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.
తాను వయస్సు మీద పడినదానిని, మనవరాలు నవ్యకు త్వరలో 28 ఏండ్లు వస్తాయి. పెళ్లికి చట్టబద్ధతతోనే బాంధవ్యం ఖరారు అయిపోతుందని అనుకోరాదని కూడా జయ బాధురి చెప్పారు. ముంబైలోని బాల్ గంధర్వ రంగ్ మందిర్‌లో ఆదివారం వి ది ఉమెన్ కార్యక్రమం బర్కా దత్ ఆధ్వర్యంలో జరిగింది. జయా బాధురితో పాటు రాణి ముఖర్జీ, జాన్వి కపూర్, మసాబా గుప్తా, సిద్థార్థ్ మల్‌హోత్రా పాల్గొన్నారు. పలు అంశాలపై వక్తలు తమ స్పందన వెలువరించారు.