ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చుట్టు ఉచ్చు బిగుస్తుంది. ఢిల్లీ పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇడి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో రాహుల్, సోనియాతో పాటు మోతాలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాతో మరో ఇద్దరు పేర్లు ఉన్నాయి. రాహుల్, సోనియా నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎఫ్ఐఆర్లో కోల్కతా కేంద్రంగా ఉన్న షెల్ కంపెనీ డోటెక్స్ పేరు బయటకు వచ్చింది. వీళ్లు కుట్ర పూరితంగా రూ.50 లక్షల చెల్లించి అనంతరం అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులను చెజిక్కించుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నేషనల్ హోరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్‌కు కాంగ్రెస్ పార్టీ రూ.90 లక్షల రుణం అందించి ఆస్తులను తమ ఆదీనంలోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ కంపెనీలో రాహుల్, సోనియాకు మెజార్టీ వాటాలు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి కేసులో ఉన్న మోతీలాల్ వోరా 2020లో దుర్మరణం చెందగా ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో కన్నుమూశారు.