రాంచీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జెఎస్‌సిఎ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని.. భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ని వైట్ వాష్ చేసిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. అయితే ఈ మ్యాచ్‌లో టెంబా బావుమా స్థానంలో సఫారీ జట్టుకు ఎయిడెన్ మార్క్‌రమ్ సారథ్యం వహించనున్నాడు. ఇక టెస్ట్ సిరీస్ ఓటమితో నిరుత్సాహంతో ఉన్న భారత్ వన్డే సిరీస్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు గాయపడిన శుభ్‌మాన్ గిల్ స్థానంలో కెఎల్ రాహుల్ భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
తుది జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కెఎల్ రాహుల్ (కెప్టెన్/కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రశిద్ధ్ కృష్ణ.
సౌతాఫ్రికా: రియాన్ రికల్టన్, క్వింటన్ డి కాక్(కీపర్), ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనెలన్ సుబ్రేయన్, నాండ్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మన్.