మనతెలంగాణ/హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు మొదటి దశకు సంబంధించి నామినేషన్ల గడువు శనివారం సాయంత్రం ముగిసింది. నామినేషన్ల దాఖలు చివరి రోజు మంచిరోజు కావడంతో అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్లు దాఖ లు చేయడానికి కేంద్రాలకు వెళ్లారు. దాంతో నామినేషన్ దాఖలు చేసేందుకు సర్పంచ్, వార్డు అభ్యర్థులతో కిక్కిరిపోయాయి. అధికారులు అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. శనివారం అర్థరాత్రి వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలు వెల్లడిస్తారు. సోమవారం అప్పీళ్ల స్వీకరణ, వచ్చే నెల 2న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. డిసెంబర్ 11న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉం టుంది. గ్రామ పంచాయతీల ఎన్నికలను పురస్కరించుకొని ఫి ర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్ర ఎన్నికల సం ఘం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గ్రీవె న్స్ మాడ్యూల్ పేరిట ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చే యవచ్చని తెలిపింది. ఫిర్యాదుల స్వీకరణకు 92400 21456 ఫోన్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించింది.