మన తెలంగాణ / హైదరాబాద్ : బొగ్గు గనుల వద్దనే థర్మల్ పవర్ పాజెక్ట్ కట్టా లని ప్రజా ప్రభుత్వం భావిస్తున్నదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశా రు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో బొగ్గు గనులు లేవని వందల కి లోమీటర్ల నుంచి బొగ్గు తీసుకురావాల్సి వస్తుందని ఇది అదనపు వ్యయం అని ఆ యన స్పష్టం చేశారు. ఎటిపిసి, జెన్‌కోలో ఎవరు తక్కువ ధరకు నిర్మిస్తే వారికే పనులు అప్పగిస్తామని తెలియజేశారు. బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నట్లుగా రూ. 50 వేల కోట్ల కుంభకోణం లేదని రాజకీయ ఉనికిని కోల్పోతామన్న భయంతోనే ఈ ఆరోపణల దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని 2047 నా టి కి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్షం అని తెలియజేశారు. అందుకు అసరమైన ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జీఎస్‌డిపి 13 శాతం పెరగాలని, జీఎస్డీపీ పెరగాలంటే అదే స్థాయిలో విద్యుత్తు వినియోగం పెరుగుదల ప్రతి ఏటా10 శాతం ఉంటుందన్న అంచనాలున్నాయని భట్టి చెప్పారు. ఆ లెక్కన 2047 నాటికి 1,39,310 మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరం ఏర్పడుతుందని, ఈ స్థాయిలో విద్యుత్ పెరుగుదల అవసరం ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 20,754 మెగావాట్లుగా ఉందని చెప్పారు. ఉత్పత్తి రంగాలైన తయారీ, వ్యవసాయ, సేవల రంగాలకు అవసరమైన నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రధానాశంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడే విధంగా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో తలసరి విద్యుత్ వినియోగానికి అనుగుణంగా తెలంగాణలో కూడా తలసరి విద్యుత్ వినియోగం పెంచడానికి ఆలోచన చేస్తూ ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఒకేసారి 10 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు దావోస్ వెళ్లి వివిధ సంస్థలతో ఎంవోలు చేసుకున్నారని, అందులో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు కానున్న డేటా, గ్లోబల్ సెంటర్స్ తో హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా మారనుందన్నారు.
ప్రతి ఏటా 10 శాతం మేర గ్రోత్ రేట్ : తెలంగాణ రాష్ట్రం 2014లో పవర్ డిమాండ్ 6,755 మెగావాట్లు ఉండేదని, 2025 నాటికి 17,162 కు పెరిగిందని భట్టి విక్రమార్క వివరించారు. 2025 -26 నాటికి 18,825 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందని, అదే 2035 నాటికి 48,827 మెగావాట్లకు పెరుగుతుందనే అంచనాలున్నాయని, 2025 నుంచి ప్రతి ఏటా 8.50 శాతం పెరుగుతుందో 2047 నాటికి ప్రతి ఏటా 10 శాతం మేర గ్రోత్ రేట్ ఉండే అంచనాలున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తులో రాష్ట్ర జీఎస్డీపీని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చేసిన దేశాలతో పోటీ పడేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించేందుకు బలమైన పునాదులు వేస్తున్నామని, అందులో భాగంగా 2047 నాటికీ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని నిర్మించే లక్షంతో ముందుకు వెళుతున్న దశలో అందుకు అనుగుణంగా విద్యుత్తు ప్రణాళికలను తయారు చేశామన్నారు. ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్డిపికి ఉపయోగపడతాయని, తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో పెరుగుతుందన్నారు.
విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 20,754 మెగావాట్లు : భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ అవసరాలు ఇలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 20,754 మెగావాట్లుగా ఉంది. కాబట్టి 2047 లక్ష్యానికి చేరుకునేందుకు విద్యుత్తు ఉత్పత్తిని పెంచుకోవాలన్నారు. విద్యుత్ వినియోగంలో 2030 నాటికి 50 శాతం గ్రీన్ ఎనర్జీనే ఉండాలని పారిస్ ఒప్పందం చెబుతోందని, 2070 నాటికి పూర్తిగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించాలనే అందులో స్పష్టంగా ఉందన్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం విద్యుత్తు పాలసీ తీసుకు రాకపోవడం వల్ల సోలార్, థర్మల్, విండ్, పంప్డ్ స్టోరేజీల్లో మనం వెనుకబడి ఉన్నామని చెప్పారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం 2029- 30 నాటికి రాష్ట్రం మైనస్ 243 మిలియన్ యూనిట్లకు వెళుతుందని చెప్పారు.
ఉత్పత్తిని పెంచుకోకపోతే ఇబ్బందులు : 2029 -30 నాటికి విద్యుత్ స్టోరేజీ 7366 మెగావాట్లు అవసరమని, సోలార్ పవర్ కొనుగోలు చేయాలంటే 25 ఏళ్ల అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని, ఇప్పటికైనా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పారు. విద్యుత్ ను బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ పాయింట్లకు అవకాశం ఉందని, పంప్డ్ స్టోరేజ్ కు తెలంగాణ అనుకూలమైన రాష్ట్రం అన్నారు. రాష్ట్రానికి కావాల్సిన వాటర్, ఎనర్జీ పుష్కలంగా ఉన్నాయని, ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తున్నదన్నారు.