న్యూయార్క్: అమెరికా దేశం కాలిపోర్నియాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. స్టాక్‌టన్‌లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగపడడంతో ఒక చిన్నారి మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా వారిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్టు సమాచారం. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.