రాంచీ: జెఎస్‌సిఎ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. 350 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ రికల్టన్ వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో రికల్టన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే మరో కీలక ఆటగాడు డికాక్(0) కూడా హర్షిత్ రాణా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే ఆర్ష్‌దీప్ బౌలింగ్‌లో కెప్టెన్ మార్క్‌రమ్(7) రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని బ్రీట్జ్కే, జోర్జిల జోడీ ఆదుకుంది. వీరిద్దరు కలిసి 66 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జోర్జి ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 37 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బ్రీట్జ్కే, యాన్సెన్‌ల జోడీ పట్టు వదలకుండ స్కోర్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బ్రీట్జ్కే, యాన్సెన్‌లు అర్థ శతకం సాధించారు. యాన్సెన్ అర్థశతకం 26 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. క్రీజ్‌లో బ్రీట్జ్కే(67), యాన్సెన్(54) ఉన్నారు.