ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 పూర్తి షెడ్యూల్‌ను బిసిసిఐ విడుదల చేసింది. డబ్ల్యూపిఎల్ 2026 ఎడిషన్ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకూ జరగనుంది. ఈసారి కేవలం నవీ ముంబై, వడోదర వేదికలుగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు బిసిసిఐ పేర్కొంది. ఈ టోర్నీలో రెండు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి దశ మ్యాచ్‌లకు డివై పాటిల్ స్టేడియం.. రెండో దశ మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్‌నకు కొటాంబి స్టేడియం వేదికలు అని తెలిపింది. జనవరి 9న తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ వడోదరా వేదికగా జరుగుతుంది.
ఇటీవలే డబ్ల్యూపిఎల్ 2026కి సంబంధించి మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో దీప్తి శర్మ అత్యధిక ధర పలికింది. ఈమెను రూ.3.20 కోట్లకు యూపి వారియర్స్ ఆర్‌టిఎం కార్డు ఉపయోగించి తీసుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్‌ను రూ.3 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇక భారత ఆల్‌రౌండర్ శిఖా పాండే రూ.2.40 కోట్లకు యూపి వారియర్స్ కివీస్ ప్లేయర్ సోఫీ ఎకిల్‌స్టోన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ జట్లు కొనుగోలు చేశాయి. తెలుగు అమ్మాయి శ్రీ చరణిని రూ.1.30 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దక్కించుకుంది.
డబ్ల్యూపిల్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే: