ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ 62 ఏళ్ల వయసులో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. శనివారం ఆంథోనీ తన చిరకాల స్నేహితురాలు జోడీ హైడెన్ వివాహం చేసుకున్నారు. కాన్‌బెర్రాలోని తన అధికారిక నివాసం ది లాడ్జ్ తోటలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో 46 ఏళ్ల ఆర్థిక వేత్త జోడీ హైడెన్ ను వివాహం చేసుకున్నారు. “మా కుటుంబం, సన్నిహితుల ముందు, మా భవిష్యత్తు జీవితాలను కలిసి గడపడానికి మా ప్రేమ, నిబద్ధతను పంచుకోవడానికి మేము పూర్తిగా సంతోషిస్తున్నాము” అని ఆంథోనీ ప్రకటన చేశారు. పదవిలో ఉండగా వివాహం చేసుకున్న దేశంలో మొదటి నాయకుడిగా ఆంథోనీ అల్బనీస్ నిలిచారు.