మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖ రారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వర కు ఈ పర్యటన కొనసాగనుంది. ప్రతి జిల్లాలో ప్రజాసభలు నిర్వహించేలా ఏ ర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతా ల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభా ఏ ర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రజాసభలను విజయవంతం చేయడానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు వేదికలు, రవాణా, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రజాపాలనలో రెండేళ్ల సాధనను ప్రజలకు వివరించడానికి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను తెలియజేయడానికి ఈ సభలను కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం చేస్తున్నారు.
అభివృద్ధి కార్యక్రమాలను
ప్రజల్లోకి తీసుకెళ్లడం
కాంగ్రెస్ ప్రభుత్వ రెండు సంవత్సరాల పాలనను ప్రజలకు వివరించడం, కొనసాగుతున్న సంక్షేమ-ం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని కాంగ్రెస్ శ్రే ణులు పేర్కొంటున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ స మ్మిట్ జరుగనుంది. ఈ అంతర్జాతీయ సమ్మిట్ లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ -2047ను వి డుదల చేయనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
డిసెంబర్ 11వ తేదీ, 14వ తేదీ, మూడోవిడత 17వ తేదీన స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపే లక్షంగా సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. తాజాగా, సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది.
సిఎం పర్యటించే
జిల్లాల వివరాలు ఇలా..
డిసెంబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి ఈ పర్యటన ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 2వ తేదీన ఖమ్మం జిల్లా కొత్తగూడెం, డిసెంబర్ 3వ తేదీన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, డిసెంబర్ 4వ తేదీన ఆదిలాబాద్, డిసెంబర్ 5వ తేదీన నర్సంపేట, డిసెంబర్ 6వ తేదీన నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తారు.