సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ‘పతంగ్’ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రంను ప్రత్యేక్షంగా వీక్షించి, చిత్ర టీమ్‌ను ప్రశంసించిన ఆయ న ’పతంగ్’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై తన సమర్పణలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ సోర్ట్స్ డ్రామా చిత్రం పతంగ్. సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషన్ సినిమాస్, మాన్సూన్ టేల్స్ సంస్థ లు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్ డ్రామా చిత్రానికి విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు.
ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. కాగా ఈ చిత్రంలోని ఎమోషనల్ డ్రామా అంటూ కొనసాగే ఓ మాసివ్ పాటను చిత్ర సమర్పకుడు సురేష్‌బాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్‌బాబు మాట్లాడుతూ “కొత్తతరం అంతా కలిసి ఈ సినిమా చేశారు. ఈ సినిమా కోసం ఎంతో ఖర్చు పెట్టి క్లైమాక్స్‌ను షూట్ చేశారు. ఓ స్టేడియంను తీసుకుని, పతంగుల పోటీ పెట్టి ఎంతో భారీగా ఆ పతాక సన్నివేశాలు తీశారు. సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది”అని అన్నారు. నిర్మాతల్లో ఒకరైన నాని బం డ్రెడ్డి మాట్లాడుతూ నవ్యమైన కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, జోస్ జిమ్మి పాల్గొన్నారు.