మన తెలంగాణ/హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల విలీ నం నేపథ్యంలో ఎన్‌ఓసీలు, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి మున్సిపల్, కార్పొరేషన్ (టౌన్‌ప్లానింగ్) అధికారులు పో టీపడుతున్నారు. దీంతోపాటు గతంలో ఇచ్చి న కొన్ని అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లు, ఎన్‌ఓసీలకు సంబంధించి ఫైళ్లను ఆయా అధికారులు మాయం చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్టుగా తెలిసిం ది. ఈనెల 25వ తేదీన కేబినెట్ భేటీలో జీహెచ్‌ఎంసీలో 27 అర్బన్‌లో కల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్)లను విలీనం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసింది.
ఈ నేపథ్యంలోనే ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయ త్నం చేస్తుండగా, తమ ఆదాయాన్ని కాపాడుకోవడానికి అధికారు లు తమవంతు ప్ర యత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెండింగ్ ఫైళ్లను దుమ్ముదులుపుతున్నార ని, అందినకాడికి దోచుకోవడానికి ఇప్పటికే దళారులు, మధ్య వర్తులతో చర్చలు జరుపుతున్నారని ఆయా విభాగంలో పనిచేసే ఉద్యోగులు ఉన్నతాధికారులకు స మాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. దీంతోపా టు పెండింగ్ ఫైళ్లకు సంబంధించి యజమానులకు ఫోన్‌లు వస్తుండడంతో వారు కూడా ఒకిం త ఆశ్చర్యానికి గురవుతున్నట్టుగా తెలిసింది. ఇన్ని రోజులుగా కాదన్న పని ఇప్పు డు ఈజీగా అయిపోతుందని అధికారులకు ఎంతో కొంత ముట్టచెప్పి తమ పని పూర్తి చే సుకోవాలన్న ఆలోచనలో ఆయా ఫైళ్లకు సంబంధించిన బాధితులు ఆసక్తి చూపుతున్నట్టుగా సమాచారం.
పెండింగ్ ఫైళ్ల యజమానులతో
సాయంత్రం భేటీ
ప్రస్తుతం విలీనమయ్యే 27 మున్సిపాలిటీ లు, కార్పొరేషన్‌లలో అధిక ఆదాయం వ చ్చే మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ విలీన ప్రక్రియ పూర్తయ్యేలోగా అందినకాడికి దండుకోవాలన్న ఆలోచనలో ఆయా విభాగాల అధికారులు తమవంతు ప్రణాళికలను రూపొందించినట్టుగా తెలిసింది. జీహెచ్‌ఎంసిలో విలీనం అయ్యే జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజా ల్, మణికొండ, నార్సింగి, కొం పల్లి, అమీన్‌పూర్, మీర్‌పేట్, తెల్లాపూర్, ఫీ ర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్‌లు (మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో) ప్రస్తుతం జరుగుతున్న అవినీతిపై భారీగా ప్రభుత్వానికి ఫి ర్యాదులు అందినట్టుగా తెలిసింది. పాత పైళ్ల న్నీ క్లియర్ చేయాలన్న ఉ త్సాహాంతో అధికారులు రాత్రివరకు పనిచేస్తున్నారని, పెండింగ్ ఫైళ్ల యజమానులను సాయంత్రం వేళల్లో కలుస్తున్నారని, ఇక ఎన్‌ఓసీల విషయమై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందుతున్నట్టుగా తెలిసింది. ఇలా, విలీన ప్రక్రియను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో పనిచేసే అధికారు లు తమకు అనుకూలంగా మలుచుకోవడం విశేషం. ఈ ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టి సారించిందని దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల
పదవీకాలం జనవరితో పూర్తి
గత సంవత్సరం సెప్టెంబర్ 2లో ఆర్డినెన్స్ ద్వారా 51 గ్రామ పంచాయతీలను ఈ 27 (మున్సిపాలిటీ, కార్పొరేషన్)ల్లో విలీనం చే సింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 27 పాలకమండళ్ల పదవీ కాలం జనవరి 2025లో పూర్తయ్యింది. అందులో భాగంగా విలీన ప్రక్రియను త్వ రగా పూర్తి చేసి జీహెచ్‌ఎంసీ పరిధిని పెం చాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ
పాలకమండలి పదవీ కాలం పూర్తి
దీంతోపాటు జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 11, 2026తో ముగియనుంది. పాలకమండలి పదవీకాలం త ర్వాత జీహెచ్‌ఎంసీలో నియమితులయ్యే ప్ర త్యేక కమిషనర్ ఆధ్వర్యంలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల విలీనాన్ని ఆమోదిస్తారు. అప్పటిలోగా అసెంబ్లీలో ఈ విలీనం పై చర్చించి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. 55 చ.కి.మీ విస్తీర్ణంతో మొదలైన ఈ మహానగరం అభివృద్ధి ప్రణాళిక ప్రస్తుతం (27 మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల విలీనంతో) 2 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది.