సంఘం ఏర్పాటు, గతంలో సంఘం రిజి స్టర్ చేసుకోవడానికి ఏడుగురు సభ్యులుంటే చాలు. దానిని ఇప్పుడు ఆ కంపెనీ కార్మికు ల సంఖ్యలో పది శాతం తప్పనిసరి చేశారు. దీని ప్రకారం, ఎవరైనా కొత్త సంఘం నిర్మాణం చేయాలంటే అసాధ్యం. ఎందుకం టే ఇన్ని నిబంధనల మధ్యలో కార్మికులు కొత్త సంఘం వైపు రావడం అసాధ్యం. కార్మికుల సంఘానికి ఎన్నికలు జరిపి ఒక సంఘానికి గుర్తింపు ఇస్తారు. ఆ సంఘం యాజమాన్యంతో కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై చర్చించి, కొన్ని డిమాండ్లను సాధించుకుంటారు. ఇది సర్వసాధారణ ప్రక్రియ. అయితే గుర్తింపు సంఘానికి జరిగే ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51 శాతంకు పైగా ఓట్లు వస్తేనే, ఆ సంఘానికి గుర్తింపు ఉంటుంది. అంతకన్నా తక్కువ వస్తే గుర్తింపు ఉండదు. ఆ ఎన్నికల్లో పాల్గొన్న సంఘాలలో 50 శాతం ఓట్లు వచ్చినా ఆ సంఘానికి గుర్తింపు ఇవ్వరు. యాజమాన్యం ఇష్ట ప్రకారం ఎవరితోనైనా చర్చలు జరపవచ్చు.
ఇది పని హక్కుకు ఒక సూచిక. అయితే ఈ చట్టాలతో ఉద్యోగ నియామకాలు అనేవి ఫిక్స్‌డ్ టర్మ్, పర్మినెంట్ ఎంప్లాయిమెంట్‌లుగా విభజించారు. దీనికి ఎటువంటి ప్రాతిపదిక లేదు. రెండు విధానాలు ఉన్నప్పుడు ఎక్కువ ప్రయోజనాలు అందించే శాశ్వత ఉద్యోగాల కన్నా, ఎప్పుడుపడితే అప్పుడు తీసివేసే ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగాల నియామకానికి యజమానులు ఎక్కువ మొగ్గు చూపుతారు. అయితే ఇప్పటికే అటువంటి ప్రక్రియ విచ్చలవిడిగా కొనసాగుతున్నది. ఇది కేవలం కంపెనీలు, పరిశ్రమలలో మాత్రమే కాదు. ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఇది చాలా ఎక్కువగా అమలవుతున్నది. అందుకే ప్రభుత్వం నేరుగా నియమించే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. దాని స్థానంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల సంఖ్య ఎక్కువైంది. ఈ చట్టాల ద్వారా అది మరింత న్యాయమైనదినా ప్రభుత్వం చెప్పదలచుకుంది. ఇది అమెరికా నుంచి సాఫ్ట్‌వేర్ ద్వారా దిగుమతి అయి, ఇప్పుడు లేబర్ కోడ్‌లతో చట్టబద్ధమైంది. ఉద్యోగ నియామకాలతో పాటు తొలగించే ప్రక్రియ కూడా సులభతరం చేశారు.
గత వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ఇది గత కార్మిక విధానాలకు పూర్తిగా భిన్నంగా ఉండడం మాత్రమే కాకుండా పూర్తిగా పారిశ్రామికవేత్తల, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుకూలంగా తయారు చేసినట్టు కనిపిస్తున్నది. ఇందులో నాలుగు విధానాలను ప్రత్యేకించి క్రోడీకరించారు. ఒకటి, పారిశ్రామిక సంబంధాలు, రెండవది వేతనాలు, మూడోది పని పరిస్థితులు, ఆరోగ్యం, నాలుగోది సామాజిక భద్రత.
వీటన్నింటిని విడివిడిగా చూడడం కన్నా మొత్తంగా కార్మికులు, వారి హక్కులు అనే విషయాన్ని పరిశీలించాలి. ఏ కార్మికునికైన ముఖ్యమైనది ఉద్యోగ నియామకం. ఉద్యోగ నియామకంలో గతంలో శాశ్వత పని స్థలాలలో శాశ్వత ఉద్యోగులను నియమించాలి. ఏదైనా తాత్కాలిక పనులుంటే అక్కడ కాంట్రాక్టు కార్మికులను గాని, క్యాజువల్ వర్కర్లను గాని నియమించాలి. ఇది ప్రాథమికమైన సూత్రం.
ఇది పని హక్కుకు ఒక సూచిక. అయితే ఈ చట్టాలతో ఉద్యోగ నియామకాలు అనేవి ఫిక్స్‌డ్ టర్మ్, పర్మినెంట్ ఎంప్లాయిమెంట్‌లుగా విభజించారు. దీనికి ఎటువంటి ప్రాతిపదిక లేదు. రెండు విధానాలు ఉన్నప్పుడు ఎక్కువ ప్రయోజనాలు అందించే శాశ్వత ఉద్యోగాల కన్నా, ఎప్పుడుపడితే అప్పుడు తీసివేసే ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగాల నియామకానికి యజమానులు ఎక్కువ మొగ్గు చూపుతారు. అయితే ఇప్పటికే అటువంటి ప్రక్రియ విచ్చలవిడిగా కొనసాగుతున్నది. ఇది కేవలం కంపెనీలు, పరిశ్రమలలో మాత్రమే కాదు. ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఇది చాలా ఎక్కువగా అమలవుతున్నది. అందుకే ప్రభుత్వం నేరుగా నియమించే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. దాని స్థానంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల సంఖ్య ఎక్కువైంది. ఈ చట్టాల ద్వారా అది మరింత న్యాయమైనదినా ప్రభుత్వం చెప్పదలచుకుంది. ఇది అమెరికా నుంచి సాఫ్ట్‌వేర్ ద్వారా దిగుమతి అయి, ఇప్పుడు లేబర్ కోడ్‌లతో చట్టబద్ధమైంది.
ఉద్యోగ నియామకాలతో పాటు తొలగించే ప్రక్రియ కూడా సులభతరం చేశారు. గతంలో ఎవరినైనా ఒక ఉద్యోగిని, కార్మికుని తొలగించదలచుకుంటే ఒక క్రమపద్ధతి ఉండేది. ముందుగా కారణాలు తెలుపుతూ, ఒక మెమో ఇవ్వడం, దానికి వివరణ కోరడం, దానితో సంతృప్తి చెందకపోతే, ఇతర పద్ధతులన్నా పూర్తి చేసి తొలగించేవారు. ఒకవేళ కంపెనీ, ఇతర సంస్థల చర్యల మీద కోర్టుకుపోతే వారి ఉద్యోగం నిలిచి ఉండేది. కాని ఈ చట్టం ద్వారా అది పూర్తిగా కంపెనీ యజమానుల నిర్ణయమే. పైగా దానికి నైపుణ్యం లోపం అనే ఒక్క కారణాన్ని జత చేస్తే చాలు వాళ్లను తీసివేయవచ్చు. రెండోది, ఆర్థికపరమైన సమస్యల ఉన్నందువల్ల తమ కంపెనీని రీస్ట్రక్చర్ చేస్తున్నామనే పేరుతో కూడా ఉద్యోగులను తీసి వేయవచ్చు. ఉద్యోగాలు కూడా రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు అని నియామక పత్రాలు ఇచ్చి, ఎల్లప్పుడు అభద్రతా భావంలోకి నెట్టివేసే అధికారం కంపెనీలకు ఇచ్చారు.
ఇక జీతాలు కూడా ఒక నియమం లేదు. అందుకు ముందున్న కనీస వేతనాల సలహా మండళ్లను నామమాత్రం చేస్తున్నారు. అవి సలహాలు మాత్రమే ఇవ్వవచ్చునని, అంతిమ నిర్ణయం కంపెనీలకే ఇచ్చారు. అందువల్ల వేతనాల, నియామకం కేవలం కంపెనీల ఇష్టా రాజ్యంగా మారిపోతున్నది. ఇది కూడా ఇప్పటికే అమలులో ఉంది. ఎవరికి ఎంత జీతం ఇవ్వాలనే అంశం చట్టాలలో ఉన్నప్పటికీ అమలు విధానం మాత్రం కంపెనీలకే అప్పజెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం, నెలకు పద్దెనిమిది వేల జీతం కన్నా తక్కువ ఉన్నా, అంతే ఉన్నా వారు కార్మికులు, ఉద్యోగులు కాదు. వారు మేనేజిమెంట్‌లో భాగం. అందువల్ల వారికి ఎటువంటి కార్మిక, ఉద్యోగ సంఘంలో చేరే హక్కు ఉండదు. ఇక్కడ నుంచే కార్మిక సంఘాలను, ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేసే కుట్ర మొదలైంది.
అదే విధంగా కార్మికుల, ఉద్యోగుల పని గంటలను ఎనిమిది గంటల నుంచి 10, 12 గంటల దాకా పొడిగించుకునే అవకాశాన్ని కంపెనీలకు అప్పజెప్పారు. గత 150 సంవత్సరాల క్రితం చికాగోలో కార్మికులు రక్తతర్పణ చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని ఈ చట్టం ద్వారా లాగేసుకున్నారు. మళ్లీ ప్రజాస్వామ్యం పూర్వపు దశకు కార్మిక లోకాన్ని తీసుకు వెళుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం, సంఘం ఏర్పాటు, గతంలో సంఘం రిజిస్టర్ చేసుకోవడానికి ఏడుగురు సభ్యులుంటే చాలు. దానిని ఇప్పుడు ఆ కంపెనీ కార్మికుల సంఖ్యలో పది శాతం తప్పనిసరి చేశారు. దీని ప్రకారం, ఎవరైనా కొత్త సంఘం నిర్మాణం చేయాలంటే అసాధ్యం. ఎందుకంటే ఇన్ని నిబంధనల మధ్యలో కార్మికులు కొత్త సంఘం వైపు రావడం అసాధ్యం.
కార్మికుల సంఘానికి ఎన్నికలు జరిపి ఒక సంఘానికి గుర్తింపు ఇస్తారు. ఆ సంఘం యాజమాన్యంతో కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై చర్చించి, కొన్ని డిమాండ్లను సాధించుకుంటారు. ఇది సర్వసాధారణ ప్రక్రియ. అయితే గుర్తింపు సంఘానికి జరిగే ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51 శాతంకు పైగా ఓట్లు వస్తేనే, ఆ సంఘానికి గుర్తింపు ఉంటుంది. అంతకన్నా తక్కువ వస్తే గుర్తింపు ఉండదు. ఆ ఎన్నికల్లో పాల్గొన్న సంఘాలలో 50 శాతం ఓట్లు వచ్చినా ఆ సంఘానికి గుర్తింపు ఇవ్వరు. యాజమాన్యం ఇష్ట ప్రకారం ఎవరితోనైనా చర్చలు జరపవచ్చు. 20 శాతం ఓట్లు వచ్చిన యూనియన్‌తోనైనా యాజమాన్యం మాట్లాడవచ్చు. అంటే ప్రజాస్వామిక ప్రక్రియ అనేది ఒక ప్రహసనంలా మార్చాలనేది దీని ఉద్దేశం. ఇది పూర్తిగా కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే చర్య.
అంతేకాకుండా, గతంలో కార్మికులు తమ అపరిష్కృత సమస్యల పరిష్కారానికి సమ్మెకు పోవాలనుకుంటే కనీసం 60 రోజులు అంటే రెండు నెలల ముందు నోటీసు ఇవ్వాలి. గతంలో ఇది పదిహేను రోజులుగా ఉండేది. దానితోపాటు కనీసం 50 శాతం మందికిపైగా కార్మికుల ఆమోదం ఉండాలి. అంటే ఇక ఎంతమాత్రం కార్మికులు పోరాటాలు చేసే పరిస్థితి లేదు. ఇంకా కొన్ని విషయాలున్నాయి. కానీ ఇవే కీలకమైనవి. గత రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి భారత స్వాతంత్య్రం వరకు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు ఈ కోడ్‌లతో శూన్యమైపోయాయి.
అయితే ఈ దుర్మార్గ చర్యలకు పునాది 1990 తర్వాత నుంచే మొదలైంది. ఆర్థిక రంగంలో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలవల్ల పెట్టుబడులను ఆకర్షించే పేరుతో రకరకాలుగా కార్మిక, ఉద్యోగుల హక్కులను నామమాత్రం చేశారు. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ దుర్మార్గాలన్నింటికీ చట్టబద్ధత కల్పించారు. ప్రజాస్వామ్యాన్ని, కార్మిక చైతన్యాన్ని పాతర వేసే ప్రక్రియకు మోడీ ప్రభుత్వం అంతిమ గీతం పాడింది.
దీనికి అంతటికీ కారణం, పెట్టుబడిదారుల, కంపెనీ యజమానుల దోపిడీకి రక్షణగా నిలవడమే ఆదాయాల పెంపు, ఆర్థిక పెరుగుదల పేరుతో యంత్రాలకు, యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా చేశారు. ఇది పెట్టుబడి, యంత్రాల కేంద్రంగా సాగుతున్న అభివృద్ధికి పెద్దపీట వేయడమే. మనిషి కేంద్రంగా మానవాభివృద్ధికి ఇక ఎంత మాత్రం స్థానం లేదన్న విషయానికి ఈ నాలుగు లేబర్ కోడ్‌లు ఒక నిలువెత్తు నిదర్శనం.
మల్లేపల్లి లక్ష్మయ్య