హైదరాబాద్: కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు మాజీ సిఎం కెసిఆర్ అలుపెరుగని పోరాటం చేశారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. నాటి కెసిఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందని అన్నారు. ఈ రోజు దీక్షా దివస్ పురస్కరించుకొని హరీశ్ రావు ఎక్స్ లో పోస్ట్ చేశారు. 2009 నవంబర్ 29న కెసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టారని, తెలంగాణ వచ్చుడో- కెసిఆర్ సచ్చుడో నినాదంతో ఉద్యమగతిని మలుపు తిప్పిందని, సరికొత్త చరిత్రకు నాంది పలికిందని తెలియజేశారు. రాష్ట్రం కోసం ప్రాణాలు చేసేందుకూ సిద్ధపడ్డ ధీరత్వం కెసిఆర్ ది అని.. తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం అని కొనియాడారు. కెసిఆర్ దీక్ష లేకుంటే.. తెలంగాణ రాష్ట్రం లేదని హరీశ్ రావు పేర్కొన్నారు.