ఈ ఏడాది ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు మాస్ మహరాజ రవితేజ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. టైటిల్ ప్రకటన వీడియోకి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి తొలి సింగిల్ ‘బెల్లా బెల్లా’ సాంగ్ ప్రోమోని విడుదల చేసింది. ప్రోమో చూసిన అభిమానులు పూర్తి పాట కోసం ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. పూర్తి పాటను డిసెంబర్ 1వ తేదీన ఉదయం 10.08 గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, అశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.