ధ్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళా మేడలోనుంచి బంగారం గొలుసు లాకొని పారిపోయిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ మయూరి నగర్ కాలనీ కి చెందిన బంగారం అమూల్య (34) కాలనీ లో మ్యూజికల్ అకాడమీ లో ఉద్యోగం చేస్తున్నారు.శనివారం కాలనీ లోని వెలాస్టిన్ పాఠశాలలో అమూల్య పేరెన్స్ టీచర్ మీటింగ్ ముగించుకొని పనిచేస్తున్న మ్యూజికల్ అకాడమి కి నడుచుకుంటూ వెళ్తుంది.మార్గమధ్య లో సుమారు 11:45 సమయానికి గుర్తు తెలియని దుండగుడు ధ్విచక్ర వాహనం పై వెనకనుండి వచ్చి అమూల్య మేడలో నుంచి 4 తొలాల బంగారు గొలుసు లాకొని పారిపోయాడు. వెంటనే అమూల్య మియాపూర్ పోలీసు లకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి బాధితురాలు అమూల్య ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.చైన్ స్నాచర్ కోసం కాలనిలో సీసీటీవీ కెమెరాల పరిసహిలిస్తూ గాలింపు చేపట్టామని తెలిపారు.