భారత హాకీ జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు 7-0తో చిలీని ఓడించగా, సీనియర్ జట్టు అజ్లాన్ షా కప్‌లో చిలీని ఓడించింది. ఇక అంతకు ముందు కెనడాతో జరిగిన మ్యాచ్‌లో భారత సీనియర్ హాకీ జట్టు ఘోర పరాజయం పాలైనా మలేషియాలోని ఇపోహ్‌లో శనివారం జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025లో చివరి రౌండ్-రాబిన్ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 14-3తో కెనడాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండర్ జుగ్రాజ్ సింగ్ 4 గోల్స్ చేసి భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతను మూడు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మార్చి భారత్ అద్భుత విజయాన్ని అందించాడు.
అలాగే ఒక పెనాల్టీ స్ట్రోక్‌ని కైవసం చేసుకున్నాడు. అభిషేక్, అమిత్ రోహిదాస్, రాజిందర్ సింగ్ తలా రెండు గోల్స్ చేయగా, సెల్వం కార్తీ, నీలకాంత్ శర్మ, సంజయ్, దిల్ ప్రీత్ సింగ్ ఒక్కో గోల్ చేసి, గెలుపు తమ వంతు పాత్ర పోషించారు. ఈ విజయం తర్వాత ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా పాయింట్ల పట్టికలో భారత్ మొదటి రెండు స్థానాల్లో నిలిచింది. భారత జట్టు ఫైనల్లో బెల్జియంతో తలపడే అవకాశం ఉంది. రౌండ్ రాబిన్ దశలో భారత్‌కు ఏకైక ఓటమిని అందించిన జట్టు ఇదే. ప్రస్తుతం 10 పాయింట్లతో ఉన్న బెల్జియం శనివారం ఏడు పాయింట్లతో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. న్యూజిలాండ్‌కి ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం చాలా తక్కువగా ఉంది, అయితే కనీసం ఆరు గోల్‌ల తేడాతో గెలవాలి.