టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో.. కుటుంబంతో కూడా అంతే సరదాగా ఉంటాడు. భార్య, పిల్లలతో కలిసి వెకేషలన్‌లకి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటాడు. అయితేవ ధోనీ సరదాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోష్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ పెళ్లి వేడుకకు హాజరైన ధోనీ.. వివాహం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమే అని ధోనీ అన్నాడు.
వివాహ వేడుకలో ధోనీ పెళ్లి కుమారుడిని ఉధ్దేశించి మాట్లాడుతూ.. ‘‘పెళ్లి మంచిదే. ప్రస్తుతం మీరు వివాహం చేసుకొనే హడావుడిలో ఉన్నారు. కొంతమంది నిప్పుతో చెలగాటం అడాలని అనుకుంటారు. ఉత్కర్ష్(పెళ్లి కొడుకు) కూడా ావరిలో ఒకడు’’ అని అన్నాడు. దీంతో అక్కడ ఉన్నవారంత ఒక్కసారిగా నవ్వులు కురిపించారు. అనంతరం తనకు ఈ విషయంలో మాత్రం మినహాయింపు లేదని.. తన భార్య కూడా అంతే అన్నాడు. ‘‘ఇక్కడ అందరు భర్తల పరిస్థితి అంతే.. నువ్వు ప్రపంచకప్ గెలిచివా.? లేదా.? అనేది ఇక్కడ అసలు విషయమే కాదు’’ అని ధోనీ తనదైన శైలీలో అందరినీ నవ్వించాడు.
Captain cool turning into Husband School 😭❤️ pic.twitter.com/tt7nD0I9Uf
— Professor Sahab (@ProfesorSahab) November 27, 2025