శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తున్న దిత్వా తుపాను తమిళనాడులో కూడా కమ్ముకొస్తోంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలపైపు దూసుకు వస్తుండడంతో ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమయ్యాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. స్కూళ్లు కాలేజీలు మూత పడ్డాయి. ఇప్పటికే ఇండిగో ప్రయాణికులకు సూచన చేయగా, తాజాగా ఎయిరిండియా కూడా విమానసర్వీసుల ప్రభావంపై అడ్వైజరీ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాలకు నడిచే 54 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు చెన్నై ఎయిర్‌పోర్ట్ వెల్లడించింది. చెన్నై సహా దక్షిణాది నగరాల నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై తుపాను భారీ వర్షాలు,
ఈదురుగాలుల తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా అడ్వైజరీలో హెచ్చరించింది. దక్షిణ రైల్వేకూడా అప్రమత్తమైంది. భారీ వర్షం, ఈదురు గాలులతో రామేశ్వరం లోనూ రెండో రోజు జనజీవనం స్తంభించింది. తుపాను తీరం దాటే సమయంలో చైన్నైలో భారీ వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణశాఖ ముం ద స్తు హెచ్చరికలు జారీ చేసింది. అనేక ప్రాంతాల్లో ఎస్టీర్‌ఎఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సహా 28 విపత్తు ప్రతిస్పందన దళాలు రంగం లోకి దిగాయి. తుపాను ప్రభావి త జిల్లాల్లో ఆరు వేల పునరావాస కేం ద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రలోని ఉ త్తర కోస్తాలో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందనివెల్లడించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ప్రకాశం, జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.