తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్) -2025 దరఖాస్తు గడువు శనివారం అర్థరాత్రి ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 2,26,956 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పేపర్ 1కు 81,921 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్ 2కు 1,45,035 మంది దరఖాస్తులు సమర్పించారు. ఈసారి టెట్‌కు 70,851 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకోగా, అందులో పేపర్ 1కు 26,788 మంది, పేపర్ 2కు 1,00,972 మంది దరఖాస్తు చేసుకున్నారు. శనివారం అర్థరాత్రి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. 2026 జనవరి 3 నుంచి 31వ తేదీ మధ్య ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 1 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులు సవరించుకునేందుకు అవకాశ ఉంది.