హైదరాబాద్: చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ తెలిపారు. తెలంగాణ కోసం చేసే ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లింది మాజీ సిఎం కెసిఆర్ అని కొనియాడారు. తెలంగాణలో బిఆర్ఎస్ దీక్షా దివాస్ నిర్వహించారు. కెసిఆర్ తెలంగాణ దీక్షకు 16 ఏళ్లు గడిచిపోయినందుకు తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ కోసం పదవులు సైతం ఆయన వదిలేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని విమర్శించారు. కౌరవులను కొట్టి మళ్లీ అధికారం లోకి వస్తామని, తెలంగాణ సంకెళ్లు తెంచిన నాయకుడు కెసిఆర్ అని తెలియజేశారు. ఉద్యమకాలంలో సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని బలి దేవత అని తిట్టారని కెటిఆర్ పేర్కొన్నారు.