కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. చినిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.