జాబ్ ఫెయిర్ ద్వారా ఎక్స్ సర్వీసెమెన్ లకు ఉద్యోగ అవకాశాలు సులువుగా లభిస్తాయని రీ సెటిల్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ ఎస్. బి. కె సింగ్ అన్నారు. శుక్రవారం డైరెక్టరేట్ జనరల్ రీ సెటిల్మెంట్ , డిపార్ట్మెంట్ అఫ్ ఎక్స్ సర్వీసెమెన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రోడ్ మైదానంలో ఎక్స్ సర్వీసెమెన్ జాబ్ ఫెయిర్ ను ముఖ్య అతిధిగా హాజరైన రీ సెటిల్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ ఎస్. బి . కె సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సె ద్వారా దేశానికి సేవలు అందించిన జవాన్ లకు వికసిత భారత్ లక్ష్యంగా ఇలాంటి జాబ్ మేళా లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 50కి పైగా కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి 12 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు.
పలు కంపెనీలు ఈ మేళా ద్వారా ఎక్స్ సర్వీసెమెన్ లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి రెండో కెరీర్ ప్రారంభించేలా ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధి గా పాల్గొన్న సి ఐ ఐ ప్రతినిధి రవి రాజ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కు చెందిన 15 కంపెనీలు ఇందులో స్టాలల్స్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫుడ్, ఫార్మసీ, మాన్యుఫాక్చరింగ్ , హాస్పిటాలిటీ, టెక్నీకల్ , సెక్యూరిటీ రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో ఎక్స్ సర్వీసెమెన్ లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ వైస్ మార్షల్ పి . ఎ. షా , జీ పీ కెప్టె న్ నీరజ్ జాంబ్ , ఏ డీ జీ బ్రిగేడియర్ రంజన్ కేరాన్ పాల్గొన్నారు.