మన తెలంగాణ/హైదరాబాద్: -రాష్ట్ర ప్రభుత్వ అ ధికారాలను హరించే విధంగా నూతన విత్తన బిల్లు ముసాయిదా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కేంద్ర ముసాయిదా విత్తన బిల్లు2025పై జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశం లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ముసాయిదా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హరించే విధంగా రూపుదిద్దుకుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం పూర్తి బాధ్యత రాష్ట్రాలదైనా, ఈ బిల్లులో కీలక అధికారాలు కేంద్రానికి కట్టబెట్టడం ఆందోళనకరమైన విషయమని మంత్రి పేర్కొన్నా రు. ముసాయిదా బిల్లులో విత్తనాల రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, మార్కెట్ నియంత్రణ, నాణ్యత పర్యవేక్షణ అంశాలు అన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకోవాలనే ధోరణి కనిపిస్తోందన్నారు. ఇది రాజ్యాంగ భావనకు వ్యతిరేకంతో పాటు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని మంత్రి పేర్కొన్నారు. విత్తన సర్టిఫికేషన్ అధికారం రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉం డాలని, విత్తనాల నాణ్యతపై ప్రత్యక్ష పర్యవేక్షణ సామర్థ్యం రాష్ట్ర యంత్రాంగానికే ఉండాలని మం త్రి స్పష్టం చేశారు.
కేంద్రం ఇచ్చే లైసెన్స్‌తో ఏ రా ష్ట్రంలో అయినా వ్యాపారం చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుందని, లైసెన్స్ రద్దు చేయాలన్నా మళ్ళీ కేంద్రానికి సిఫార్సు చేయాలని, రాష్ట్ర పరిధి లో ఇలాంటి అంశాలలో చర్య తీసుకోవడానికి అ వకాశం లేదని మంత్రి వివరించారు. మార్కెట్ లో ఏ కంపెనీ ఎంత ధరకు అమ్ముతుందో తెలియద ని, వీటిపై నియంత్రణ లేదని, ఎంత ధరకు అ మ్మాలనే నిర్దేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముసాయిదాలో కల్పించలేదని మంత్రి తెలిపా రు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే ధర నిర్ణయిం చే అధికారం ప్రభుత్వానికి ఉందని మంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనం రైతుకు అందుబాటు లో తేవటం ఎంత కీలకమో, నాణ్యత లోపం ఉన్నప్పుడు నకిలీ విత్తనాలతో నష్టం జరిగినప్పుడు రైతులకు సకాలంలో నష్ట పరిహారం అందించే ఏర్పా టు కూడా అంతే కీలకమని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత 1966 విత్తన చట్టంలో, ఈ ముసాయిదా బిల్లులో కానీ నష్ట పరిహారానికి సంబంధించిన నియమం లేదని, రాష్ట్రంలో ఈ సమస్య అధికంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. భారతదేశం లో పండిస్తున్న విత్తనాలలో 40శాతం పైగా విత్తనాల ఉత్పత్తి రాష్ట్రంలోనే జరుగుతోందని, రైతులు కంపెనీల కోసం విత్తనాలని పండించి ఇచ్చేటప్పుడు వారికి నష్టం జరిగితే నష్ట పరిహారం ఇచ్చే ఏర్పాటు ఉండాలని మంత్రి డిమాండ్ చేశారు.
సాంప్రదాయ విత్తనాల రక్షణ, రాష్ట్రంలో రైతుల కోసం పనిచేసే కొన్ని సంస్థలు సీడ్ బ్యాంకులు పెడుతున్నాయని, పాతకాలం నాటి విత్తనాలు, మూల విత్తనాలు దాచిపెట్టడం, పాత విత్తనాలను రైతుకు అందుబాటులో ఉంచేందకు కృషి చేస్తున్నామన్నారు. ఈ అంశాలన్నీ రాబోయే చట్టం నుంచి మినహాయించారని, వీటి కోసం ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఇవ్వలేదని వాపోయారు. ఇతర దేశాల్లో పండించిన విత్తనాలు అక్కడ సర్టిఫికేషన్ ఏజెన్సీలు సర్టిఫై చేస్తే మన దేశంలో వాటిని తీసుకొచ్చి అమ్ముకొనే వెసులు బాటు చట్టం కల్పిస్తుందని, దీని వల్ల విదేశీ కంపెనీలకు మేలు జరుగుతుందన్నారు.
విదేశాలలో ఉత్పత్తయిన విత్తనాలకు మన దేశంలో ట్రయల్స్ జరిగిన తర్వాత, మన దేశంలో ఉన్న సర్టిఫికేషన్ ఏజెన్సీ ఆమోదిస్తేనే స్థానికంగా అమ్మే విధంగా ఉండాలని, లేదంటే నకిలీ విత్తనాలు దేశంలోకి వచ్చే అవకాశం పెరుగుతుందని మంత్రి తెలిపారు. దీనికి అనుగుణంగాఈ ముసాయిదాల మార్పు చేయాలని మంత్రి కోరారు. విత్తనాల నాణ్యత, నియంత్రణ కోసం ఈ చట్టం ఉద్దేశ్యం మంచిదే అని, రైతుల రక్షణ, రాష్ట్రాల హక్కులు, నష్టపరిహారం విధానం, విత్తన రైతుల సమస్యలు వంటి కీలక అంశాల్లో అవసరమైన మార్పులు చేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని, అందుకనుగుణంగా బిల్లులో మార్పులు చేయాలని కోరారు. కేంద్రం ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని, దేశంలోని ప్రతి రైతుకు మేలు చేసేలా బిల్లు సిద్ధం చేస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కొదండరాం, రాష్ట్ర విత్తనభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డె శోభనాధ్రిశ్వరరావు, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, వైస్ ఛాన్సలర్ లు జానయ్య, రాజిరెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, విత్తనరంగ నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.