ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ స్పందనతో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
ఈ సమావేశంలో రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. “ఈ కథ విన్నప్పుడే థ్రిల్ అయిపోయాను. ఎమోషనల్‌గా అద్భుతంగా అనిపించింది. కానీ టైటిల్ ఆంధ్ర కింగ్ అని చెప్పినప్పుడు కాస్త టెన్షన్ అనిపించింది. నేను ఎలా ఆంధ్ర కింగ్ అవుతాను అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది… ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర కింగ్స్. నేను కింగ్ లాగా ఫీల్ అవుతున్నాను అంటే అది మీ గొప్పతనం. అంత పెద్ద మనసు మీది. నేను గత 25 ఏళ్లుగా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇది నా స్థానం అనిపిస్తుంది. డైరెక్టర్ మహేష్ అద్భుతమైన సినిమా తీశారు. హీరో, ఫ్యాన్ మధ్య వున్న డివైన్ ఎమోషన్‌ని అద్భుతంగా చూపించారు. సినిమాకి ఇంత అద్భుతమైన స్పందన ఇచ్చిన ఆడియన్స్‌కి ధన్యవాదాలు”అని అన్నారు.
డైరెక్టర్ మహేష్ బాబు పి మాట్లాడుతూ.. “రామ్, ఉపేంద్ర మ్యాజిక్ చేశారు. ఒక మంచి టీంతో ప్రయాణం చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతం ఆంధ్ర కింగ్ తాలూకా”అని తెలిపారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ “ఈ సినిమాకి వచ్చిన స్పందన చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ మహేష్ బాబుకి చాలా గొప్ప పేరు వచ్చింది. రైటింగ్, డైరెక్షన్ అద్భుతంగా చేశారు. ఇది చాలా లాంగ్ రన్ ఉన్న సినిమా. ఇది కేవలం ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు ఫ్యామిలీస్, పిల్లలు, యూత్ అందరూ ఎంజాయ్ చేసే కథ. అందరికీ నచ్చి మెచ్చే సినిమా ఇది”అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్కేఎన్, వివేక్, మెర్విన్ పాల్గొన్నారు.