తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికలతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి.. పార్టీ లీడర్లు, కార్యకర్తలను కలిసేందుకు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ ౧వ తేదీ నుంచి జిల్లా పట్టణాల్లో సిఎం రేవంత్ పర్యటించనున్నట్లు సమాచారం.
కాగా, ఈసారి రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకుంటున్నారు.