రాయ్‌పూర్: అందరం కలిసి ఒకేసారి లొంగిపోతామని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఛత్తీస్‌గడ్-మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ ప్రతినిధి పేరుతో అనంత్ లేఖ విడుదల చేశారు. జనవరి-౧న ఆయుధాలను విడిచి లొంగిపోతామని వివరించారు. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని పేర్కొన్నారు. ఇప్పటికే హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ బలహీనమైంది. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగిపోయిన విషయం తెలిసిందే. మిగిలిన వారు లొంగిపోవాలని కేంద్రం విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామని, ఆయుధాలు ప్రభుత్వాలకు అప్పగించి పునరావాసాన్ని అంగీకరిస్తామని తెలియజేశారు. అందరం లొంగిపోయే వరకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని కోరారు. జనజీవన స్రవింతిలో కలిసేందుకు సమయం కావాలని గతంలో మావోయిస్టులు లేఖ రాసిన సంగతి తెలిసిందే.