తిరువనంతపురం: కేరళలోని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ రాహుల్ మామ్‌కుటత్తిల్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. రాహుల్ తనపై అత్యాచారం చేయడంతో పాటు గర్భాన్ని తొలగించుకోవాలని బలవంతం చేయడంతో పాటు తనని చంపేస్తానని బెదిరిస్తున్నాడని ముఖ్యమంత్రి పినరయ్ విజయ్‌కు యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్నామని, తనకు బిడ్డకావాలని పలుమార్లు కాంగ్రెస్ ఎంఎల్‌ఎ రాహుల్ బలవంతం చేశాడన్నారు. గర్భం దాల్చిన తరువాత అబార్షన్ చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడని వివరించింది. తాను అబార్షన్ చేసుకోవడానికి వ్యతిరేకించడంతో తనని చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను రికార్డు చేసి పోలీసులకు అప్పగించింది.
ఈ ఘటనపై రాహుల్ స్పందించారు. తాను ఇప్పటివరకు తప్పు చేయలేదని, కావాలని తనని ఇరిక్కిస్తున్నారని, దీనిని చట్టపరంగా ఎదుర్కొంటానని తెలియజేశారు. గతంలో రాహుల్ మామ్‌కుటత్తిల్ తననిపై లైంగికంగా వేధించాడని ఓ నటి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనన లైంగికంగా వేధిస్తున్నాడని నటి రీని జార్జ్ ఇంటర్వూలో ఆరోపణలు చేసిన విషయం విధితమే.