గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ’అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ తమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక అద్భుతంగా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఆనాడు చత్రపతి శివాజీ సైన్యంలో కూడా అఘోరాలు ఉండేవారు. గొప్ప పోరాటం చేసేవారు. నా సినిమా ఉగాది పచ్చడి లాంటిది. అన్ని రసాలు ఉండాలి. ఈ సినిమాలో సంయుక్త చేసిన పాట కూడా చాలా మంచి సందర్భంలో వస్తుంది. ఆది పినిశెట్టి చాలా చక్కని పాత్ర చేశారు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మురళీమోహన్ ఇందులో చాలా అద్భుతమైన పాత్ర చేశారు. ఆకృత్యాలు మీరితే మనిషే ఆ దైవాన్ని తనలో ఆవహించుకుంటాడు అనేదే ఈ సినిమా. సినిమా అద్భుతంగా వచ్చింది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ చాలా అద్భుతమైన పోరాటాలు సమకూర్చారు. నిర్మాతలు రామ్, గోపి లెజెండ్ తో మా ప్రయాణం మొదలైంది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా వారి బ్యానర్ లో చేయడం జరిగింది ‘అని అన్నారు.
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘అఖండ ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్లింది. తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి అనుకుని ఈ సినిమా ప్రారంభించాం. తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమమని. భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు. ఇందులో మేము షూట్ చేసిన కొన్ని లొకేషన్స్ చూస్తే మీకు నమ్మసక్యంగా ఉండవు. ఆ భగవంతుడే మాకు దారి చూపించాడు. అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. వరల్ వైడ్ ప్రేక్షకులు ఈ సినిమాని ఆనందంగా చూడాలని కోరుకుంటున్నాను‘ అని పేర్కొన్నారు. నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ ‘కెమెరా ముందు మా బాలయ్య బాబు తాండవం. కెమెరా వెనకాల డైరెక్టర్ బోయపాటి తాండవం డిసెంబర్ 5న థియేటర్లో ప్రేక్షకులు తాండవం.. ఇది పక్కా. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. దానికి మించి ఇది డబల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. డిసెంబర్ 5న దేశం మొత్తం బాలయ్య బాబు నట విశ్వరూపం చూస్తుంది‘ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమన్, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి, పూర్ణ, మురళీ మోహన్, కబీర్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పాల్గొన్నారు.