హైదరాబాద్ ప్రపంచంలోని టాప్ 100 బెస్ట్ సిటీస్‌లో 82వ స్థానం సాధించడం నగర అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం పొన్నం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. స్టార్ట్‌ప్‌లు, మెడిటెక్, బయోటెక్, గ్లోబల్ క్యాంపసెస్, అడ్వాన్స్‌డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జీవన ప్రమాణాలతో పాటు అన్ని రంగాల్లో నగరం వేగంగా ఎదుగుతోందని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పారదర్శక పరిపాలన, మౌలిక వసతుల మెరుగుదల, పచ్చదనం–అన్ని రంగాల్లో వృద్ధి హైదరాబాద్‌ను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. హైదరాబాద్ ప్రగతి అనేది ప్రజల విజయం అని పొన్నం కొనియాడారు.