కొలంబో: శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారనుంది. ఈ తుఫాన్ కి దిత్వాగా నామకరణం చేశారు. తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు నుంచి తుఫాన్ పయనించనుంది. తుఫాన్ ప్రభావం ఆదివారం నుంచి ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. 29వ తేదీ రాత్రి నుంచే ఈదురు గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ ౩౦, డిసెంబర్ 1వ తేదీల్లో రాయల సీమలోని వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, తిరుపతి, నెల్లూరు, దక్షిణ ప్రకాశం జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. భారీ వర్షాల కారణంగా డిసెంబర్ 1న ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.